పలు పరీక్షాకేంద్రాలను తనిఖీ చేసిన డిప్యూటీడీఈవో చంద్రమౌళేశ్వరరావు

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్న పరీక్షా కేంద్రాలను డిప్యూటీ డీఈవో చంద్రమౌళేశ్వరరావు గురువారం పరీశీలించారు. మం డలంలోని తాళ్లూరు వి. కె. ఉన్నత పాఠశాల, శ్రీ సరస్వతీ హైస్కూల్, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు, జడ్పీహైస్కూల్ , అమెరికా పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాలు పరీక్షల నిర్వహణకు అనువుగా వున్నవా వసతులు ఏవిధంగా వున్నాయి. విద్యారుల సరిపడా గదులు, వంటి అంశాలను పరిశీలించారు. ఆయా పాఠశాలల రికార్డులను, విద్యార్థుల, ఉపాధ్యాయుల హజరుశాతాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయ ల నియామకం జరిగినందును పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోఎంఈవోలు జి.సుబ్బయ్య, ఎల్. సుధాకర్ రావు, హెచ్ఎంలు వైఎస్ఆర్ కెప్రసాద్, వి.శ్రీరామ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *