బేగంపేట జనవరి 20 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
మహంకాళి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా ఎస్.రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు.గతంలో ఈయన ఉస్మానియా యూనివర్సిటీ పోలీసుస్టేషన్ లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా పని చేశారు.హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో ఇన్స్పెక్టర్ల బదిలీలలో భాగంగా మహంకాళి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో గా యస్.రవి కుమార్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని అన్నారు.
