ఘనంగా ఉర్సు ఈ షరీఫ్ ఊరేగింపు.ముఖ్య అతిథులను సత్కరించిన అల్తాఫ్ రాజా.

ఓల్డ్ బోయిన్ పల్లి, ఫిబ్రవరి 8,
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ హస్మంత్ పేట్ అజ్రత్ సయ్యద్ గౌస్ హాజం దస్తగిరి గార్వి షరీఫ్ ముబారక్ ఉత్సవాలను, మైనార్టీ యువ నాయకుడు అల్తప్ రాజా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్ గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి, ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్, కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీ బండి రమేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దండుగుల యాదగిరి తదితరులు హాజరయ్యారు. ముఖ్య అతిథులను అల్తాఫ్ రాజా గజమాల శాలువాలతో ఘనంగా సత్కరించారు.అనంతరం పోలీసు అధికారులను కూడా పూల మాలలతో ఘనంగా సత్కరించారు.ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, బోయిన్ పల్లి, అల్వాల్, పోలీస్ లు బందోబస్తు నిర్వహించారు. ముస్లిం మైనారిటీ నాయకులు యువకులు ఉర్సు ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ. ఉర్సు వేడుకలు మతాలకు అతీతంగానిర్వహించుకోవడం సంతోషమని అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *