ముండ్లమూరు మండలంలోని మారెళ్ళ గ్రామంలో కొలువుదీరిన గోపయ్య స్వామి లక్ష్మి తిరుపతమ్మ అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ పదవ వార్షికోత్సవ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు ,అర్చనలు నిర్వహించారు. వేద పండితులు ప్రసాదు, జనార్ధన్ శర్మ, రాము లు వేద మంత్రోచ్ఛరణలతో గోపయ్య , తిరుపతమ్మ స్వాములకు విశేష పూజలు నిర్వహించారు.
ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరించారు. సాయంత్రం స్వామి వార్లను గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఆలయంలో స్వామి వారి వద్ద పలువురు ఉభయ దాతలు గార్లపాటి హరినాధ బాబు, రాధిక, చల్లగుండ్ల ఏడుకొండలు, లక్ష్మీ కుమారి పీటలపై కూర్చొని కళ్యాణం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గార్ల పాటి శ్రీనివాసరావు, శివకుమారి, గార్ల పాటి సత్యనారాయణ, గార్లపాటి శ్రీనివాసరావు, గార్లపాటి శివయ్య, గార్లపాటి రాంబాబు, గార్లపాటి గోపాల్, పోలిశెట్టి మహేష్, గునుపూడి నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు. భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు.


