రంజాన్ పండుగను శనివారం ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. తూర్పుగంగవరం, మల్కాపురం లలో ప్రత్యేక నవాజ్ లు నిర్వహించారు. రామభద్రాపురం, శివ రామపురం, మల్కాపురం, బొద్దికూరపాడు, గంగ పాలెం (తురకపాలెం)లలో ముస్లీం సోదరులు నవాజ్ నిర్వహించి ఒకరి కొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కోఆప్షన్ మెంబర్ ఆదాం షరీఫ్ (బుజ్జి), మల్కాపురం సర్పంచి షేక్ వలి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, నయ్యద్ లతీఫ్, మస్తాన్, పలువురు ముస్లీం నాయకులు ముస్లీం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ప్రత్యేక నవాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
