ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీసు అధికారులు మరియు సిబ్బంది ప్రార్థనా మందిరాలు, స్థలాల వద్ద పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు.
రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు ప్రకాశం జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలియ చేశారు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా జరుపుకునే రంజాన్ పర్వదినం పురస్కరించుకుని జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ముందస్తూ జాగ్రత్తలలో భాగంగా మసీదులు, ప్రార్థనా మందిరాలు/స్థలాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు. ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఎలాంటి ఆటంకాలు, అవాంతరాలు జరుగకుండా బందోస్తు చేపట్టారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలతో కూడా నిఘా ఏర్పాటు చేశారు.
