తాగు (మంచి) నీరు అందించండి మహా ప్రభో ..

ప్రజలకు శుభ్రమైన మంచి నీరు అందించాన్న లక్ష్యంతో జల మాసోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే కనీసం జల మాసోత్సవంలో అయినా సరే శుద్ద నీరు కాదు….అసలు నీరే అందించలేని ఘనత ఆర్ డబ్ల్యు ఎన్ శాఖకు దక్కుతుంది. దశాబ్దాలుగా తాళ్లూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయ పరిధిలో ఉన్న మంచి నీటి ట్యాంకులో నిత్యం నీరు నిల్వ ఉంటూ మండల కేంద్రంలోని ప్రజల దాహార్తి తీర్చుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి నీటి సంక్షోభం ఏర్పడినది. నిత్యం నీరు ఉండే తాళ్లూరు, కొత్త పాలెంలలో ట్యాంకులలో సైతం మంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగర్ నీరు తాగటం అలవాటు పడిన ప్రజలు మాత్రం సాగర్ నీటి కోసం ఇతర గ్రామాలు, పలు మండలాలకు వెళ్లి క్యాన్ లలో తెచ్చుకుంటున్నారు. రామతీర్థం మంచి నీటి స్కీము నుండి నరఫరా అయ్యే ఎన్ ఎన్పీ తాగు నీరు స్కీం లో పనిచేసే వర్కర్లకు సైతం 9 నెలలుగా జీతాలు లేక పోవటంతో వారు సైతం స్ట్రైక్ లో వెళ్తున్నట్లు సమాచారం. దీంతో తాగు నీటి సరఫరా మరింత అలస్యం అయ్యే ప్రమాదం ఉన్నది. ఒక వైపు మండే ఎండలు వస్తుంటే మరో వైపు తాగు నీరు అందించలేని ప్రభుత్వ యంత్రాంగం తీరును ప్రజలు నిశితంగా విమర్శిస్తున్నారు. మాటలు కోటలు దాటతాయి.. కాళ్లు గడప తాటవు …..అన్న దానికి ఆర్ డబ్యు ఎన్ అధికారుల పనితీరే నిదర్శమని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకుని మంచి నీటి సరఫరాను పునరిద్దరించాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe
చుక్కనీరులేని తాళ్లూరు మండల కాంప్లెక్స్ లోని ఎన్ఎస్పి ట్యాంక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *