తాళ్లూరు మండలంలో బుధవారం నిర్వహించిన ఫిజికల్ సైన్స్ ( పీఎస్ ) పరీక్షకు 9 మంది గైర్హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి సుబ్బయ్య, ఎంఈఓ – 2 సుధాకర్ రావు లు తెలిపారు. బొద్దికూరపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో 184 మంది గాను ఒకరు గైర్హాజరు, తూర్పుగంగవరం జెడ్పీ ఉన్నత పాఠశాలలో 249 మంది గారు ఇరువురు గైర్హాజరు, వికే ఉన్నత పాఠశాలలో 161 మంది గాను ఇరువురు గైర్హాజరు, నరస్వతి అన్ ఎయిడెడ్ పాఠశాలలో 121 మంది కి గాను నలుగురు గైర్హాజరు అయినట్లు చెప్పారు. నాగేంద్ర వర్ధన్ అధికారులు స్క్వాడ్ బృందం తాళ్లూరు, తూర్పుగంగవరం, బొద్దికూరపాడు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆయా పరీక్షా కేంద్రాలకు డీఓలుగా చాంద్ బాష, యు వెంకటేశ్వర్లు, సుబ్బలక్ష్మమ్మ, మోహన్ గాంధీ, చీఫ్ లుగా శ్రీనివాస రావు, స్వామి దాను, శ్రీ రంగ నాయకులు, నవనీతమ్మ లు వ్యవహరించారు.
తాళ్లూరు మండలంలో ఫిజికల్ సైన్స్ పరీక్షకు 9 మంది గైర్హాజరు
25
Mar