శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శ్రీ సీతా రాముల కళ్యాణం లో పాల్గొన్న తలసాని..

బేగంపేట మార్చి 27
(జె ఎస్ డిఎం న్యూస్) :
బేగంపేట డివిజన్లో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో
సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. బేగంపేట లోని
శ్రీ కేసరి హనుమాన్ ఆలయం, భగవంతపూర్ ,ప్రకాష్ నగర్ లోని మహావీర్ ఎమరాల్డ్ అపార్ట్మెంట్లలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. పూజల అనంతరం నిర్వాహకులు తలసానిని సన్మానించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ మహేశ్వరి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు శ్రీహరి, నరేందర్ నాయి, శేఖర్, శ్యాం, నాగరాజు తదితరులు ఉన్నారు.
రాంగోపాల్ పేట్ డివిజన్లో…. రాంగోపాల్ పేట్ డివిజన్లోని జీరాలో శ్రీ సీతా రామచంద్రస్వామి ఆలయం, శ్రీ బాలాజీ మందిర్ విక్టోరియా గంజ్ కమిటీ హాల్ ,పీజీ రోడ్ లోని కృష్ణ నగర్ లో నిర్వహించిన శ్రీ సీతారాములు కళ్యాణంలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని పూజలు నిర్వహించారు .పూజల అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలను అందించారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్లు అత్తిలి మల్లికార్జున్ గౌడ్, అరుణ గౌడ్, కిరణమయి బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, కిషోర్ వెంకటేష్ బాబు, సతీష్ ,గణేష్, అరుణ్ బట్ ప్రవీణ్, సంజయ్ ,తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *