పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి కృతఙ్ఞతలు తెలిపిన అభిషేక్ అడపా.

హైదరాబాద్, ఏప్రిల్ 15
(జే ఎస్ డి ఎం న్యూస్) :
పదవులు అలంకారం కాకుండా నిరంతరం శ్రమించాలనీ టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనను కలిసిన అభిషేక్ ఆడపా కు సూచించారు. ఇటీవల సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అభిషేక్ అడపా టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అభిషేక్ తనపై ఉంచిన విశ్వాసానికి, బాధ్యతలనుఅప్పగించినందుకు మహేష్ కుమార్ గౌడ్ కు పార్టీ అధిష్టానానికి,సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ నాయకత్వం తనపై చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా కృషి చేస్తానని అభిషేక్ పేర్కొన్నారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమర్థవంతంగా పని చేస్తానని చెప్పారు. ప్రజలకు చేరువగా ఉండి, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా నిజాయితీ, నిబద్ధతతో సేవలందించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలనువిజయవంతం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తానని అభిషేక్ ఆడపా తెలిపారు. ఈ కార్యక్రమంలో అభిషేక్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన వారిలో నాయకులు హానిఫ్ ఖాన్ ,అల్తమాష్ తదితరులు ఉన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *