బేగంపేట ఏప్రిల్ 17
(జే ఎస్ డి ఎం న్యూస్) :
దేవుడికి పెట్టిన దీపం చీరకు అంటుకుని రిటైర్డ్ ప్రిన్సిపాల్ మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్ లాల్ బిల్డింగ్ లో చోటు చేసుకుంది.శ్యామ్ లాల్ బిల్డింగ్ లో ఒక ఇంట్లోని పై అంతస్తులో విజయలక్ష్మి అనే రిటైర్డ్ ప్రిన్సిపాల్ నివాసం ఉంటుంది.ఆమె దేవుడికి దీపం వెలిగిస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తు దీపం చీరె కొంగుకు అంటుకుంది.చీరకు నిప్పు అంటుకున్న క్రమంలో తీవ్ర భయాందోళనలకు గురైన విజయలక్ష్మి బెడ్ రూమ్ లోకి వెళ్లింది.ఈ క్రమంలో దుప్పటి అంటుకోవడంతో మంటలు మరింత తీవ్ర గాయాలు కావడం తో ఆమె అక్కడికి అక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఇంట్లో నుంచి పొగలు రావడం తో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.అదే ఇంట్లో రెండవ అంతస్తులో తన కూతురు నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.పాఠశాల ప్రిన్సిపాల్ గా పని చేసి రిటైర్డ్ అయిన విజయలక్ష్మి ఇంట్లోనే ఉంటున్నట్లు పోలీస్ లు తెలియజేశారు.ప్రతి రోజు మధ్యాహ్నం సమయంలో ఆమె పూజ చేస్తుందని కుమార్తె తెలియజేసింది.దేవుడికి వెలిగించిన దీపం ఆమె చీరకు అంటుకుని మంటలు పెద్దగా చెలరేగడంతో శరీర భాగాలు కాలిపోయి మృతి చెందినట్లు ఆమె తెలిపారు.ఈ సంఘటనపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
