వికలాంగుల హక్కుల సాధన సమితి ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ దివ్యాంగుల హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడు బందెల కిరణ్ రాజ్ శనివారం నియామక పత్రం అందించారు. జిల్లాలోని దివ్యాంగులు ఎదుర్కోంటున్న సమస్యలపై నిరంతర పోరాటం చేస్తూ అధికారులు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చెయ్యాలని ఈ సందర్భంగా సూచించారు. తనపై నమ్మకంతో ప్రకాశం జిల్లా వికలాంగుల హక్కుల సాధన సమితి అధ్యక్షుడిగా నియమించినందుకు రమణయ్య కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పారు. తన శాయ శక్తులు దివ్యాంగుల హక్కుల పరిరక్షణకు తోడ్పడతానని, వికలాంగుల హక్కుల సాధన సమితి బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.
