రాజన్న సిరిసిల్ల, మే 2,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మైనార్టీలకు పార్టీ ప్రభుత్వం లో స్థానం కల్పించాలన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అని. ఏ ఐ సి సి అబ్జర్వర్ మహమ్మద్ ఫయాజ్ అన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ మైనార్టీ విభాగం సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనారిటీ విభాగం రాష్ట్ర నాయకులు, ఏఐసీసీ అబ్జర్వర్ మహమ్మద్ ఫయాజ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ అధ్యక్షులు ఎస్.కె సాహెబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమ్మద్ ఫయాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం ఒకటొకటిగా అమలు చేస్తూ అన్ని వర్గాలకు పదవులలో ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుందన్నారు. మైనార్టీలకు ప్రభుత్వంలో, పార్టీలో సముచిత స్థానం కల్పించాలనేది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఇందులో భాగంగా మైనార్టీలకు దక్కాల్సిన పదవులు నియామకాలు మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి నాయకులకు వివరించారు .ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు ముఖ్య కార్యకర్తలు మరియు ఇల్లంతకుంట మండల అధ్యక్షులు జమాల్ పాల్గొన్నారు.


