‘పది’లో ప్రతిభావంతులకు నగదు బహుమతులు -విద్యార్థులను సత్కరించిన మంత్రి, కలెక్టర్

పదో తరగతి పబ్లిక్ పరీక్షా-2026 ఫలితాలు విడదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు ఎంతో ప్రతిభ కనబరచి ఉత్తమ మార్కులు సాధించారు. అద్దంకి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలైన అద్దంకి, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, జె.పంగులూరులో అత్యధిక మార్కులు సాధించిన టాప్-5 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. శుక్రవారం సంతమాగులూరు మండల కేంద్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికపై మంత్రి రవికుమార్, కలెక్టర్ రాజాబాబుతో కలిసి అద్దంకి అర్బన్ తో పాటు ఐదు మండలాల్లో ఎంపికైన టాపర్లకు, వారి తల్లిదండ్రులను శాలువా కప్పి, రూ.10 వేల నగదు ప్రోత్సాహంతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, జిల్లా విద్యా శాఖాధికారి రేణుక, ఎంఈఓలు వేమవరపు కోటేశ్వరరావు, దార్ల దినేష్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *