సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానానికి ఒంగోలు వాస్తవ్యులు ఐలవరపు జయప్రకాశ నారాయణ రూ 1,01,116 రూపాయల విరాళాన్ని శనివారం దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ చుండూరి మురళి సుధాకర్ కు అందజేశారు. దాతకు స్వామి చిత్రపటాన్ని శేష వస్త్రాన్ని బహుకరించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఏల్చూరి నారాయణమ్మ గోపి, అర్చకులు కిషోర్ ,సీతారామాంజనేయులు పాల్గొన్నారు.
