ప్రగతిశీల భావాజాలంతోనే సమస్యల పరిష్కారం సాధ్యంసీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిఆదిలాబాద్ జిల్లా ప్రజావాణి పైలెట్ ప్రాజెక్టు నివేదిక ఆవిష్కరణ.

హైదరాబాద్ ,మే 19,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రగతిశీల భావజాలం ఉంటే ప్రజావాణికి వచ్చే సమస్యల మూలాలు అర్థమై వాటి పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని సీఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి అన్నారు.
మంగళవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్ లో ఆదిలాబాద్ జిల్లాలో ప్రజావాణి అమలు తీరుపై పైలెట్ ప్రాజెక్టు నివేదికను చిన్నారెడ్డి, సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ నిర్వాహకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజావాణికి వివిధ సమస్యలతో వచ్చే దరఖాస్తుదారుల పట్ల అధికారులు, సిబ్బంది సానుకూల ధోరణితో స్పందించాలని, అప్పుడే పిటిషనర్ల ముఖంలో సంతోషంచూడగలుగుతామని పేర్కొన్నారు.రాష్ట్ర, జిల్లా స్థాయిలో కొనసాగుతున్న ప్రజావాణిని డివిజన్ స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం విస్తరించిందని, రానున్న కాలంలో మండల స్థాయిలో కూడా ప్రజావాణిని నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని చిన్నారెడ్డి తెలిపారు.సీఎం ప్రజావాణిలో ఓపికతో ప్రజల సమస్యలనుపరిష్కరిస్తున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో సీఎం ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్, నిర్వాహకులు హర్ష, ఆనందిత, అభిషేక్, అఖిల్, సీఎం ప్రజావాణి అధికారులు రాకేష్ రెడ్డి, జగన్, సహదేవ్, సాయి, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *