బేగంపేట ,జూన్ 25 ,(జే ఎస్ డి ఎం న్యూస్)
ఓటు హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కు మాత్రమే కాకుండా, వారి సామాజిక ఉనికికి, గుర్తింపుకు ప్రతీక అని టి పి సి సి ఉపాధ్యక్షురాలు, సనత్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి, ఏ ఐ సి సి సభ్యురాలు డా. కోట నీలిమ అన్నారు. ఒక్క అర్హత కలిగిన ఓటరి పేరు కూడా ఓటరు జాబితా నుంచితొలగిపోకుండా, ఎవరి ఓటు హక్కు కూడా కోల్పోకుండా ఉండేలా సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు.ఈ సందర్భంగా డా. కోట నీలిమమాట్లాడుతూ.. ఓటు హక్కు
కోల్పోవడం అంటే ప్రజాస్వామ్యంలో తన సర్వాన్ని కోల్పోవడమేనన్నారు. అందుకే ప్రతి అర్హత కలిగిన ఓటరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా పనిచేస్తోంది. ప్రజల ఓటు హక్కును పరిరక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు. సనత్నగర్ నియోజకవర్గ ప్రజలందరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో చురుకుగా పాల్గొని, తమ వివరాలను ధృవీకరించుకోవడంతో పాటు తమ ఓటు హక్కును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఓటు కీలకమని పేర్కొన్నారు.
డా. కోట నీలిమ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, SIR సూపర్వైజర్లు, కోఆర్డినేటర్లు, బూత్ లెవల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ లతోకలిసి ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేటర్ ఫామ్లుఅందజేస్తున్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలకు అవసరమైన సహకారం అందిస్తూ, వారి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో ప్రతి ఓటరు తమ వ్యక్తిగత వివరాలను ధృవీకరించుకోవాలని, బూత్ లెవల్ అధికారుల ద్వారా అందజేయబడుతున్న ఫారాలను పూర్తిగా, ఖచ్చితంగా నింపి తిరిగి సమర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓటరు జాబితాలో పేరు ఉండటం ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం కావడానికి అత్యంత కీలకమని చెప్తున్నారు.
ఓటు హక్కు, ఉనికి కాపాడేందుకు సనత్నగర్ కాంగ్రెస్ నాయకుల కృషి:డా. కోట నీలిమ
25
Jun