బేగంపేట,జూన్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్) :
మహాత్మా జ్యోతి బా పూలే ప్రజాభవన్ లో ఈ నెల 26న జరగాల్సిన సీ ఎం ప్రజావాణి ని మొహర్రం సందర్భంగా 30కి మార్చినట్లు సీ ఎం ప్రజావాణి నోడల్ అధికారి దివ్య దేవరాజన్ ఒక ప్రకటనలో తెలియ జేశారు.26శుక్రవారం రోజున జరగాల్సిన సీ ఎం ప్రజావాణి కార్యక్రమం 30 మంగళ వారానికి మార్పు చేశారు.ఈ మార్పును గమనించి 26 శుక్రవారం కాకుండా 30వ తేదీ మంగళవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కావాలని నోడల్ అధికారి తెలియ జేశారు.
