బేగంపేట జూన్25,
(జే ఎస్ డి ఎంన్యూస్) :
బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లో డ్రైనేజ్ ,వర్షపు నీటి సరఫరా పైపు లైన్ పనులను అధికారులు బుధవారం పరిశీలించారు.
కొంత కాలం క్రితం డ్రైనేజ్ పైపు లైన్ పనులు నిలిపి వేశారు. ఈ విషయాన్ని స్థానికులు మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి ల దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే తలసాని దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన ఎమ్మెల్యే అధికారులను అప్రమత్తం చేయడంతో వారు కాంట్రాక్టర్ తో కలిసి బుధవారం ఓల్డ్ కస్టమ్స్ బస్తీ కి చేరుకుని పైపు లైన్ ను పరిశీలించారు.వీలు అయినంత త్వరలో పనులను పూర్తి చేసేలా చూస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు జి హెచ్ ఎం సి డి ఈ మహేష్ ,ఏ ఈ గణేష్,స్థానిక బి ఆర్ ఎస్ యువ నాయకుడు ఆరిఫ్ ,స్థానికులు పాల్గొన్నారు.
