ట్రాఫిక్ చక్ర బంధంలో బ్రాహ్మణ వాడి,మాతాజీ నగర్.ఓల్డ్ కస్టమ్స్ బస్తీ ఫ్లై ఓవర్ కింద రినోవేషన్ పనులు ప్రారంభం.రాంగ్ రూట్ లోనే రాక పోకలు సాగించాల్సిన దుస్తితి.నిత్యం ట్రాఫిక్ జామ్ తో తలనొప్పిగా మారిందంటున్న స్థానికులు.

బేగంపేట జూన్ 25,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ట్రాఫిక్ చక్ర బంధంలో బ్రాహ్మణవాడి,మాతాజీ నగర్, వడ్డెర బస్తీ,ఓల్డ్ కస్టమ్స్ బస్తీ లు చిక్కుకున్నాయి. దీంతో బస్తీ నుంచి బయటకు వెళ్లి రావడం ప్రహసనంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.ఇటీవల ఓల్డ్ కస్టమ్స్ బస్తీ ఫ్లై ఓవర్ కింద రినోవేషన్ పనులు ప్రారంబించారు.దీంతో బ్రాహ్మణవాడి ,మాతాజీ నగర్ ల నుంచి వచ్చే మార్గాని ఫ్లై ఓవర్ కింద పనుల కారణంగా మూసివేశారు.దీంతో ఆయా బస్తీల నుంచి ప్రయాణించేవారు. రాంగ్ రూట్ లోనే రాక పోకలు సాగించాల్సిన దుస్తితి నెలకొంది.దీంతో
నిత్యం ట్రాఫిక్ జామ్ తో తలనొప్పిగా మారిందనీ స్థానికులు వాపోతున్నారు.ఇదే ప్రాంతంలో వున్న ప్రయివేటు పాఠశాలకు విద్యార్థులను తీసుకు వచ్చే కార్లు,ఆటో లు,ఇతరత్రా వాహనాలను రోడ్డు పైనే పార్కింగ్ చేస్తున్నారు.ఇక్కడే సికింద్రాబాద్ వైపు నుంచి పై బస్తీలకు వచ్చే వాహనాలు ఈ మార్గంలోనే రావాల్సి ఉంటుంది.గతంలో ఈ రోడ్డు జంక్షన్ లో రాంగ్ రూట్ లో వాహనాలు రాకుండా అధికారులు డివైడర్లు ఏర్పాటు చేసి రోడ్డు మూసివేశారు.అయితే ఇటీవల ఫ్లై ఓవర్ పనులు ప్రారంభం కావడంతో బ్రాహ్మణ వాడి,మాతాజీ నగర్,వడ్డెర బస్తీ తదితర బస్తీల నుంచి వచ్చే వారు ఫ్లై ఓవర్ కిందికి వచ్చి మరలా కుడి వైపు మరలి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో నిత్యం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది.ఒక వైపు సికింద్రాబాద్ నుంచి బస్తీ లోకి వచ్చే వాహనాలు,ఇంకోవైపు పై బస్తీల నుంచి బయటకు వెళ్లే వాహనాలు, ఇదీ కాక ప్రయివేటు పాఠ శాల ముందు అదే మార్గంలో పాఠ శాల సమయాల్లో రోడ్డుకు రెండు వైపుల వాహనాలను నిలిపి ఉంచడంతో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని పై బస్తీల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పై బస్తీల వాసులు తమ పిల్లలను అమీర్పేట , సికింద్రాబాద్ లలో ఉన్న కాలేజీలకు వెళ్లేందుకు ప్రధాన రోడ్డుపైకి దింపి వస్తుంటారు.సాయంత్రం తిరిగి తీసుకు వచ్చుకుంటుంటారు.ఫ్లై ఓవర్ పనుల కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది.ఇప్పటికైనా ట్రాఫిక్ వున్నతాది కారులు బేగంపేట ఫ్లై ఓవర్ కింద రినోవేషన్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించి తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ట్రాఫిక్ చక్రబంధం నుంచి పై బస్తీల కు విముక్తి కల్పించాలని పై బస్తీల ప్రజలు, వాహన దారులు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *