బేగంపేట జూన్ 26,(జే ఎస్ డి ఎం న్యూస్)
ప్రతి ఒక్కరు ప్రతిరోజు జిమ్ చేయడం అలవాటు చేసుకోవాలని కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గము బేగంపేట మోతీలాల్ నెహ్రూ నగర్ పార్క్ లో ఆయన సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే ,బి జే పి నాయకులు మర్రి శశిధర్ రెడ్డి తో కలిసి ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని వివిధనియోజకవర్గాలలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేశామని, యువత, స్థానికులు ఓపెన్ జిమ్ లను ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండగోని భరత్ గౌడ్ , మాజీ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ ,రాష్ట్ర బిజెపి యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి నెమలి ఆనంద్, బిజెపి ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



