కంటోన్మెంట్ జూన్ 27 , జే ఎస్ డి ఎం న్యూస్ :
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు వార్డు-6 పరిధిలో శనివారం విస్తృత అవగాహన కార్యక్రమంనిర్వహించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, టీఎస్‌బీసీఎల్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్, కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ), పొలిటికల్ ఏజెంట్లతో (బీఎల్ఏ) కలిసి ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియపై ప్రజలకు అవగాహనకల్పించారు.ఈ సందర్భంగా గజ్జెల నాగేష్ మాట్లాడుతూ వచ్చే నెల 24వ తేదీ వరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ లోపు బీఎల్ఓలు అడిగిన వివరాలను అందించి ఓటరుగా నమోదుచేసుకోవాలని కోరారు.
అధికారులు ఇంటింటికీ వచ్చి ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి తిరిగి వారికే అందజేయాలని, లేనిపక్షంలో ఓటర్ల లిస్టు నుంచి పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఓటు హక్కు సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత కంటోన్మెంట్ నివేదిత, మాజీ బోర్డు సభ్యులు పాండు యాదవ్, గణేష్, కనకయ్య, బీఎల్ఓలు పాల్గొన్నారు.

