విద్యుత్ షాక్ తగిలి తాళ్లూరు ఎస్సీ కాలనీకి చెందిన అనపర్తి ఆదేమ్మ (45) గురువారం మృతి చెందగా ఆమె కుమార్తె మన్నా మేరీ తీవ్ర గాయాల పాలైనది. వివరాలలోనికి వెలితే .. .. తమ నివాసం సమీపంలో వేప చెట్టుపై పిచ్చుక గూడ కట్టుకున్నది. గాలలకు ఆ గూడు నుండి పిచ్చుక పిల్లలు క్రింద పడిపోయాయి. ఇది గమనించిన అదేమ్మ తమ కుమార్తె సహాకారంతో ఆ గూడుని సరిచేసి అందులో పిల్లలను వెయ్యాలని తలచింది. తక్షణమే ఆమె తమ సమీపంలో ఉన్న బ్యానర్ ఇనుప రాడ్ ను ఉపయోగించి పైన గూడు వద్ద సరిచేయటానికి ప్రయత్నించు సమయంలో ఆ రాడ్ ప్రధాన విద్యుత్ తీగలకు తగిలి షాక్ కు గురై సైడు కాలువలోనికి పడిపోయినది. కుమార్తె మున్నా మేరీ తీవ్రంగా గాయాలైనది. ఇరువురిని వైద్య శాలకు తరలించారు. ఆదేమ్మ మృతి చెందగా, మున్నా మేరీ గాయాలపాలైనది. ఆదేమ్మకు భర్త, ఇరువురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. అనపర్తి ఆదేమ్మ అంగన్వాడీ ఆయా గా పని చేస్తున్నది . సంఘటన స్థలాన్ని విద్యుత్ ఎఈ రామక్రిష్ణా రెడ్డి పరిశీలించారు.



