రాంగోపాల్ పేట జూలై 7,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని రాంగోపాల్‌పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణ శ్రీనివాస్ గౌడ్ డివిజన్ లో విస్తృతంగా పర్యటించి పరిశీలించారు. డివిజన్ నాయకులతో కలిసి కలాసిగూడ, జీరా, ఓల్డ్ ఘాస్ మండి, నల్లగుట్ట, చుట్ల బస్తీ ప్రాంతాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ అధికారులు (BLOs), బూత్ లెవెల్ ఏజెంట్లు (BLAs) మరియు స్థానిక ప్రజలతో మాట్లాడి, ఓటర్ల నమోదు, సవరణ ఫారమ్‌ల పురోగతిని పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దరఖాస్తు ఫారమ్‌లను పూర్తి చేసి
అధికారులకు అందజేయాలని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనిఆమె కోరారు. కార్యక్రమంలో డివిజన్ నాయకులు గణేష్, సతీష్, ఆంజనేయులు, టీనా, అభిషేక్, నర్సింగ్ రావు, కిషోర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.


