విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి: బేగంపేట ఇన్‌స్పెక్టర్ సైదులు.

బేగంపేట, జూలై 11(జే ఎస్ డి ఎం న్యూస్) :
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, సేవాభావం మరియు నాయకత్వ లక్షణాలనుఅలవర్చుకోవాలని బేగంపేట
ఇన్‌స్పెక్టర్ సైదులు పిలుపునిచ్చారు. బేగంపేటలోని సైబర్ మన్సూరా స్కూల్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన విద్యార్థి ప్రతినిధుల ప్రమాణ స్వీకారమహోత్సవానికి (ఇన్వెస్టిచర్ సెర్మనీ) ఆయన ముఖ్య అతిథిగాహాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీధర్, పాఠశాల యాజమాన్యంతో కలిసి నూతనంగా ఎన్నికైన స్కూల్ లీడర్స్, కెప్టెన్లకు బ్యాడ్జ్‌లను బహూకరించి అభినందనలు తెలిపారు.
అనంతరం ఇన్‌స్పెక్టర్ సైదులుమాట్లాడుతూ. నిజమైన నాయకత్వం అంటే కేవలం అధికారం కాదని, తోటి విద్యార్థుల పట్ల జవాబుదారీతనం, నిబద్ధత కలిగి ఉండటమేనని స్పష్టం చేశారు. నాయకుడనే వాడు సమస్యలను గుర్తించడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే మంచి పరిష్కారాన్ని అందించాలని సూచించారు. ఇదే వేదికపై ఆయన విద్యార్థులకు ప్రస్తుత సమాజంలో ఎదురవుతున్న పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ వినియోగంపై అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. యువత జీవితాలను ఛిద్రం చేస్తున్న డ్రగ్స్ సంస్కృతికి దూరంగా ఉంటూ “సే నో టు డ్రగ్స్” నినాదాన్ని పాటించాలని, సమాజ రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలు, యువత సహకరించాలని కోరారు. భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దడంలో పాఠశాల యాజమాన్యం తీసుకుంటున్న చొరవను అభినందిస్తూ, నూతన విద్యార్థి కమిటీకి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *