అన్నివర్గాల ప్రజలఅభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదని మండలటీడీపీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వరరెడ్డి అన్నారు . తాళ్లూరులో బుధవారం మండల టీడీపీ సమావేశం జరిగింది. కూటమి పాలన వచ్చిన తరువాత దర్శి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సహకారంతో మండలంలోని అన్నిగ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. అభివృద్ధి పనులు విషయమై పార్టీ శ్రేణులు విన్న వించి ఇంచార్జి డాక్టర్ లక్ష్మి దృష్టికి తీసుక వెళ్లి నిధుల మంజూరుకుకృషి చేస్తామన్నారు. సర్ కార్యక్రమం పొడిగించినందున ఓట్ల నమోదు ఫారాలు మిగిలి వుంటే, బియల్వోలకు అందజేయాలని, క్లైమ్ల విచారణ సమయంలో అప్రమత్తంగా వుండాలన్నారు. ఈకార్యక్రమంలో టీడీపీమండల ప్రధానకార్యదర్శి పిన్నిక రమేష్, మండల తెలుగు రైతుఅధ్యక్షులు కైపురామకోటిరెడ్డి, రాష్ట్రనాటక అకాడమి కార్పోరేషన్ డైరె క్టర్ బి.ఓబుల్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఐవెంకటేశ్వరరెడ్డి, మానం రమేష్ బాబు , జి.వేణుబాబు, తూముశినాగిరెడ్డి, రాచకొండవెంకట్రావు, వల్లభనేని సుబ్బ య్య, కళ్యాణ్ చక్రవర్తి, నాగార్జురెడ్డి, కుమ్మిత సుబ్బారెడ్డి, అనపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
