సికింద్రాబాద్ జులై 31,(జే ఎస్ డి ఎం న్యూస్)
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి సతీమణి గీతారెడ్డి శుక్రవారం దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి జి .మనోహర్ రెడ్డి గీతా రెడ్డికి ఆలయ సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికి పూజలు నిర్వహింపజేశారు. ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఆలయ వేద పండితులు వేణుమాధవ్ శర్మ, ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ లు గీతారెడ్డికి ఆశీర్వచనం అందజేశారు. సీఎం సతీమణి వెంట సనత్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ కోట నీలిమ, శ్రీ ఉజ్జయిని మహాకాళి ట్రస్ట్ బోర్డ్ మెంబర్లు గుండెల్లి దేవివరప్రసాద్, చెక్కల రాజేందర్ ముదిరాజ్, ముప్పిడి కిరణ్, దేవరపల్లి రమేష్, గంట గీత సుధీర్ కుమార్, మంత్రి సోనాలి, గుంటి మల్లికార్జున్, డాక్టర్ శివలాల్, కటకం భాస్కర్ గుప్తా సంజయ్ ప్రకాష్ , ఠాకూర్ హేమంత్ సింగ్, రాకేష్ అగర్వాల్, శ్రీకాంత్ చారి ఉన్నారు.

