తాళ్లూరు మండల ప్రజలకు రామ * తీర్థం మే*…. మంచినీటి సరఫరా అస్తవ్యస్తం – తరచూ మోటార్లు మరమ్మతులు- ఇబ్బందులు పడుతున్న ప్రజలు – 24 గంటల్లోనే పరిష్కరిస్తామని ప్రకటనలు – 1077 టోల్ ఫ్రీ నంబర్లు సైతం ఏర్పాటు – ఫలితం నున్నా

తాళ్లూరు మండలంలోని 16 పంచాయితీలోని గ్రామాలకు రామతీర్థం నుండి నీటి సరఫరా అన్తవ్యస్తంగా మారి ప్రజలకు తాగునీరు తీర్ధము లా మారింది కూటమి ప్రభుత్వంలో తరుచూ మంచినీటిని కూడా అందించడంలో విఫల తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. మరో వైపు జిల్లా స్థాయి అధికారులు నమావేశాలు నిర్వహిస్తూ 24 గంటలలో నమస్యలను పరిష్కరిస్తామంటూ 1077 టోల్ ఫ్రీ నంబర్ ను సైతం ఏర్పాటు చేస్తున్నా ఫలితం నున్నా అవుతుంది. రామ తీర్థం జలాశయం వద్ద ఏర్పాటుచేసిన పం పింగ్ హౌన్ లోని మోటార్లు మరమ్మతులకు గురయ్యాయి. గత మార్చి నెలలో 25 రోజుల పాటు నీరు రాక విల విల లాడారు. మరలా గత 24 రోజులుగా తాగు నీరు అందటం లేదు. బిల్లులు సరిగా రాకపోవడంతో కాంట్రాక్టర్ మరమ్మతులు చే యించకపోవటంతో గత 24రోజులుగా మంచి నీటి సరఫరా నక్రమంగాలేక ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. కొంతకాలంగా ఆర్. డబ్ల్యూ ఎస్ అధికారుల నిర్లక్ష్యం, నీటి పంపిణీ కాంట్రాక్టర్ బా ధ్యతారాహిత్యంతో మంచినీటి నరఫరాకు తరుచూ అంతరాయం ఏర్పడుతుంది. తాళ్లూరు మండలంలోని బోర్లలో ఫ్లోరిన్ శాతం అధికంగా ఉంది. దీంతో గ్రామాల్లో ట్యాంక్లు, మినీ వాటర్ ట్యాంక్లు నిర్మించి రామతీర్థం రిజర్వాయర్ ద్వారా గ్రామాలకు మంచినీరు సరఫరా చేస్తున్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని వాతావరణశాఖ సూచించటంతో ప్రభుత్వం ప్రజలకు మంచినీటి సమస్య ఉత్పన్నం కాకుండా రామతీర్థం జలాశయాన్ని సాగర్ జలాలతో నింపారు. దేవుడు వర మిచ్చినా పూజారి వరమివ్వని చందంగా . .. … .ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వహరిస్తున్నా అధికారుల పనితీరుతో ప్రభుత్వం అభాసు పాలవుతున్నది. రామతీర్థం రిజర్వాయర్లో నీరు పుష్కలంగా ఉండి మంచి నీటికి నమస్య ఉండదని ప్రజలు బావిస్తున్న తరుణంలో తరుచూ పంపింగ్ చేసే మోటార్లు కాలిపో తున్నాయి. దీంతో మంచినీటి సరఫరా నిలిచి పోతున్నది. గత 24 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచి పోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆర్డబ్ల్యూ ఎస్ అధికారులు మాత్రం సమస్యను పరి ష్కరించి నీటిని విడుదల చేస్తామని చెబుతున్నారే తప్ప ఆచరణలో అమలు జరగటంలేదని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. తరుచూ మరమ్మతులకు గురవుతున్న మోటార్లస్థానంలో కొత్తవి ఏర్పాటుచేసి రామతీర్థం నీటినరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

1077 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు అయినా కష్టాలు తీరేనా….. అని ప్రజలు ఎదురుచూస్తున్నారు. నీటి కష్టాలు తీర్చటానికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ను ఏర్పాటు చేసి నట్లు తెలిపారు . ఉదయం 8 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పనిచేస్తుందని, అవసరమైతే 24 గంటలు కూడ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ వివరించారు. దీంతో ఆయా నంబర్లకు ఇకపై మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో ఫోన్లో చేసి తమ కష్టాలు తెలుపుకునే వీలుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మండే ఎండలకు మంచినీరు ఇవ్వండి మహాప్రభో అని వేడుకుంటున్నారు.

oplus_2

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *