జర్నలిస్ట్ ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వ ఆమోదం…రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కె.పార్థ సారథిని కలసి ధన్యవాదాలు తెలిపిన…APUWJ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు.

మార్కాపురం :
రాష్ట్ర వ్యాప్తంగా వున్న అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి ఏపి యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు కు తెలిపారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ఆదివారం సాయంత్రం మంత్రి మార్కాపురం చేరుకున్న సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆయనను కలిసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అలాగే నివాస స్థలాలకు సంబంధించిన అంశం గురించి చర్చించారు.

అందుకు స్పందించిన మంత్రి పార్థ సారథి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించిందని తెలిపారు.
ఈ పథకం వలన రాష్ట్ర వ్యాప్తంగా వున్న సుమారు 20 వేల మంది అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు ఉపయోగం జరగనుందని, అలాగే
ఈ పాలసీ వెంటనే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.
ఈ పాలసీ పొందిన వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మృతి చెందితే ఆ కుటుంబానికి రూ 10 లక్షల రూపాయల మేరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని, కావున ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన జర్నలిస్ట్ లను కోరారు.
నూతనంగా ఏర్పడిన జిల్లాలో సమాచార శాఖ సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని, త్వరలో భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు.
2019- 24 మధ్య కాలంలో వైసిపి ప్రభుత్వం ఈ పాలసీని పట్టించుకోలేదని, దీంతో జర్నలిస్ట్ లు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు.
అలాగే అర్హులైన జర్నలిస్ట్ లకు నివాస స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఐవి.

తమ యూనియన్ విజ్ఞప్తి మేరకు జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి. సుబ్బారావు మంత్రి పార్థసారధికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి పార్థ సారథిని కలసిన వారిలో APUWJ జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బంకా శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె. బాజీవలి,కోశాధికారి దారివేముల బాబీతో పాటు పలువురు జర్నలిస్ట్ లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *