ప్రజల సమస్యలను పరిష్కరించటమే లక్ష్యం

తాళ్లూరు: ప్రజల నమస్యలు పరిష్కరించటమే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు చిత్త శుద్దితో పనిచెయ్యాలని మండల ప్రత్యేక అధికారి, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ ఫేక్ ఫైజుద్దీన్ అన్నారు. మల్కాపురం స్వర్ణ గ్రామ కార్యాలయం వద్ద మీకోసం పీజీ ఆర్ ఎన్ కార్యక్రమం గ్రామ ప్రత్యేక అధికారి ఎంఈఓ జి సుబ్బయ్య అధ్యక్షతన నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేస్తే పరిష్కారం అవుతాయని మండల ప్రత్యేక అధికారి అన్నారు. పీజీఆర్ఎన్లో 13 దరఖాస్తులు అందాయి. అనంతరం హైస్కూల్ ను సందర్శించారు. విద్యార్థులకు నరిపడ తరగతి గదులు లేక పోవటంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్నబోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. సంఘ సంస్కర్త గురుజాడ అప్పారావుకు నివాళి అర్పించారు. ఎంపీడీఓ అజిత, తహసీల్దార్ రమణా రావు, ఎఎంసీ డైరెక్టర్ ఖాశిం సైదా, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీనివాస రావు, వివిధ విభాగాల ఎఈ లు రామక్రిష్ణా రెడ్డి, హనుమం రావు, పశువైద్యాధికారి ప్రతాప్ రెడ్డి, వ్యవసాయాధికారి ప్రసాద రావు, ఎపీఓ వెంకటేశ్వర రావు, ఎపీఎం దేవ రాజ్, హెల్త్ నూపర్ వైజర్ రవి కుమార్, పంచాయితీ కార్యదర్శి మొలకయ్య, విఆర్ ఓ నాగూర్ బీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *