తాళ్లూరు: మండలంలో మంగళవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది. గత వారం రోజుల నుండి పలు మార్లు వర్షం కురవటంతో పొలాలు పదునెక్కటంతో పంట సాగుకు రైతులు మొగ్గు చూపారు. ఈనేపథ్యంలో మరలా కురిసిన వర్షం వలన కొంత మేర వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడినట్లయిది. అయితే వాతావరణం చల్లబడి కొంత మేర వేడిమి తగ్గటంతో వృద్ధులు, పిల్లలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే మౌళిక వసతులు లేమితో వీధులు బురధ మయం అయ్యాయి. రజానగరం, తాళ్లూరు రోడ్లో మురుగు నీరు రోడ్ల పై చేరటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
