బేగంపేట సెప్టెంబర్ 24,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ట్రాఫిక్ నిర్వహణ ,రహదారి భద్రత పై ట్రాఫిక్ పోలీసులు దృష్టి సారించాలి అని
మల్కాజ్ గిరి సి పి సుమతి అన్నారు.వార్షిక తనిఖీలో భాగంగా బి. సుమతి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ట్రాఫిక్ ట్రిముల్ఘెర్రీ డివిజన్, మల్కాజిగిరి కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు.
తనిఖీ సందర్భంగా సి పి తిరుమలగిరి డివిజన్ పనితీరును సమీక్షించి, ట్రాఫిక్ నిర్వహణ, రహదారి భద్రత మరియు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా పలు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై మరింత అవగాహన కల్పించడంతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత కృషి చేయాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ సిబ్బంది ప్రజలతో మంచి
స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తూ, ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని ఆదేశించారు.ప్రధాన రహదారులు, ఆర్టీరియల్ రోడ్లపైనే కాకుండా రెసిడెన్షియల్ కాలనీలు మరియు అంతర్గత రహదారుల్లో కూడా ట్రాఫిక్ సమస్యలు, అక్రమ పార్కింగ్ మరియు ఆక్రమణలను గుర్తించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వీటి కారణంగా ట్రాఫిక్ రాకపోకలకు అంతరాయం కలగకుండా, స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనీ సూచిస్తూ, ముఖ్యమైన ప్రాంతాలు మరియు జంక్షన్ల వద్ద, ముఖ్యంగా పీక్ అవర్స్‌లో, ట్రాఫిక్ సిబ్బంది స్పష్టంగా కనిపించే విధంగా విధులు నిర్వహించి ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించడంతో పాటు రహదారి భద్రతను పెంపొందించాలని ఆదేశించారు.కొత్తగా ఏర్పడుతున్న ,ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న జంక్షన్లను గుర్తించి, వాటి ట్రాఫిక్ నియంత్రణ మరియు అభివృద్ధికి సంబంధించిన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైన చోట్ల జంక్షన్ అభివృద్ధి మరియు మెరుగుదల చర్యలను చేపట్టి,ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలు మరియు ఇతర ఏజెన్సీలతో సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ప్రజలు మరియు ఇతర ప్రభుత్వ శాఖలు/విభాగాల వంటి స్టేక్హోల్డర్లకు గుర్తుండిపోయే విధంగా వినూత్నమైన, ఆచరణాత్మకమైన మరియు ఫలితాల ఆధారిత ట్రాఫిక్ కార్యక్రమాలు, చర్యలను చేపట్టాలన్నారు. ట్రాఫిక్ పోలీసింగ్ ప్రజలకు కనిపించేలా, స్పందించేలా మరియు రహదారి వినియోగదారులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే విధంగా ఉండాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీ సందర్భంగా ట్రాఫిక్ వన్ డిసిపి కె. రాహుల్ రెడ్డి, కూడా హాజరయ్యారు. సమీక్షలో తిరుమలగిరి డివిజన్ ట్రాఫిక్ ఏసిపి జి శంకర్ రాజు బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాస్, అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ డిఆర్ ప్రమోద్ కుమార్ ఇన్స్పెక్టర్ వి. సర్దార్ నాయక్, అడిషనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్
ఐ వి రమణయ్య పవన్ కుమార్ రెడ్డి, జి. జానకి రాములు, తదితరులు తనిఖీ సందర్భంగా హాజరయ్యారు.తనిఖీ సందర్భంగా సి పి జారీ చేసిన సూచనలను సమర్థవంతంగా అమలు చేస్తామని, రహదారి భద్రత, సాఫీగా ట్రాఫిక్ రాకపోకలు, ప్రజలకు సౌకర్యం మరియు ప్రజా అనుకూల ట్రాఫిక్ పోలీసింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.



