తాళ్లూరు : జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంను పురష్కరించుకుని శుక్రవారం మండలంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలోని విద్యార్థులకు ఆల్ బెండా జోల్ మాత్రలను పంపిణీ చేసారు. తాళ్లూరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో 25 పాఠశాలలు, 26 అంగన్ వాడీ కేంద్రాలలో 4500 మంది విద్యార్థులకు తాళ్లూరు పీహెచ్సీ వైద్యాదికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజేష్ యాదవ్, హెల్త్ సూపర్ వైజర్ రవి ఆరోగ్య, అంగన్ వాడీ, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొని మాత్రలను విద్యార్థులచే మిగించారు. నులిపురుగుల ప్రాముఖ్యతను వివరించారు. తూర్పుగంగవరం ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరధిలో 30 పాఠశాలలు, 28 అంగన్వాడీ కేంద్రాలలో విద్యార్థులు 4751 మందికి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ మౌనిక, డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, హెచ్ఐఓ చంధ్రశేఖర్, పీహెచ్ఎన్ రమణమ్మ, హెచ్పీ నుశీల ఆరోగ్య, ఆశ, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులకు ఆల్ బెండాజోల్ మాత్రు మిగించారు.

