వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ లిడ్ క్యాప్ చైర్మన్, కీర్తిశేషులు కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి వైసీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ‘ఈ కష్ట సమయంలో మీకు పార్టీ అండగా ఉంటుంది.. కుటుంబానికి అవసర మైన అన్ని విధాలా సహాయ సహకారాలు అం దిస్తాం’ అని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంగళవారం ఒంగోలు వచ్చిన జగన్.. క్లౌ పేటలోని రాజశేఖర్ నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులు రాజశేఖర్ సతీమణి షర్మిల శేఖర్, అన్నయ్య రాజ శిఖామణి, తన యులు శషీర్ రాజ్, అమల్ రాజ్, కోడళ్లు జీనా తీయాంక, ఏంజిలాలను పరామర్శించారు.
పార్టీకి తీరని లోటు..
కాకుమాను రాజశేఖర్ మృతిపై జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ కోసం రాజశేఖర్ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. కుటుంబ సభ్యులతో సుమారు 45 నిముషాలు మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.
జగన్ రాకతో కేడర్‌లో ఉత్సాహం..
సుదీర్ఘ విరామం తర్వాత జగన్ ఒంగోలుకు రావడంతో వైసీపీ శ్రేణుల్లో
ఉత్సాహం ప్రకటించిన సమయానికి కొద్దినిమిషాల తేడాతో ఆయన కనిపించింది. హెలికాప్టర్లో ఏబీఎం కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకున్నారు. తమ అధినేతను చూసేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఏబీఎం గ్రౌండ్, రైల్వేస్టేషన్ రోడ్డు పరిసరాలు వైసీపీ శ్రేణులతో కిక్కిరిశాయి.
హెలిప్యాడ్ వద్ద నేతల సందడి..
జగన్ కు హెలిప్యాడ్ వద్ద రాజ్యసభసభ్యుడు వై.వి.సుబ్బారెడ్డి, ప్రాంతీయ సమన్వయకర్త అయోధ్య రామిరెడ్డి, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్
బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి తదితరులు సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి
, రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్, శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ మంత్రులు డాక్టర్ అదిమూలపు సురేష్, డాక్టర్ మేరుగు నాగార్జున, రాష్ట్ర నాయకులు టిజెఆర్ సుధాకర్ బాబు, నియోజకవర్గ సమన్వయ కర్తలు చుండూరు రవిబాబు, అన్నా వెంకట రాంబాబు, కుందూరు నాగార్జునరెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్, కరణం వెంకటేష్, డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ తదితరులు జగన్ ను కలిశారు. మాజీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, కదిరి బాబురావు, కసుకుర్తి ఆదెన్న, ఉడుముల శ్రీనివాసరెడ్డి, తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.






Save or share this story as a newspaper-style Epaper Clip: