ఒంగోలు గిత్తల రాజసంతో మైమరిచిన ప్రకాశం సీమ – కన్నులపండువగా ‘ఒంగోలు ఉత్సవం’ భారీ ర్యాలీ! -100 జతలతో ఒంగోలు జాతి గిత్తల ఘన ప్రదర్శన – జనసంద్రంగా మారిన ప్రకాశం సీమ! -ప్రకాశం సీమలో పౌరుష నాదం.. కన్నులపండువగా ‘ఒంగోలు గిత్తల’ మహోత్సవం

ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి 150 వసంతాలు పూర్తయిన చారిత్రాత్మక శుభసందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘ఒంగోలు ఉత్సవం’ నగరంలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక పండుగ వాతావరణాన్ని నింపింది. ఈ ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఒంగోలు వీధుల్లో కన్నులపండువగా సాగిన ‘ఒంగోలు గిత్తల భారీ ర్యాలీ’ పౌరుషానికి, తెలుగువారి సంస్కృతికి అద్దం పట్టింది. నగరంలోని మినీ స్టేడియం వద్ద ఘనంగా ప్రారంభమైన ఈ శోభాయాత్ర అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు అత్యంత వైభవంగా సాగింది. ఒంగోలు నగర చరిత్రలోనే కాకుండా ప్రకాశం జిల్లా సాంస్కృతిక చరిత్రలోనే ఇది ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయేలా వేడుకలు జరిగాయి.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

​తెలుగు నేల గర్వించదగ్గ ఒంగోలు జాతి విశిష్టతను చాటిచెబుతూ ఏకంగా 100 జతల ఎద్దులు ఈ ర్యాలీలో ఊరేగాయి. కాడికి కట్టిన ఒంగోలు గిత్తల కట్టుదిట్టమైన శారీరక సౌందర్యం, మెడలో మెరిసే గజ్జెల రవళులు, శబ్దించే గంటల నాదాలు నగర ప్రజలను ఎంతగానో పులకింపజేశాయి. మినీ స్టేడియం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు దారి పొడవునా విద్యుత్ కాంతుల వెలుగులు, రంగురంగుల తోరణాలు, పూల అలంకరణలతో ఒంగోలు నగరం అంగరంగ వైభవంగా మారి అచ్చమైన పల్లెటూరి పండగ శోభను సంతరించుకుంది. గిత్తల రాజసాన్ని, వాటి నడకలోని అందాలను చూసిన జనం ఆనందంతో మురిసిపోయారు.

​​మన ప్రసిద్ధ ఒంగోలు గిత్తల సౌందర్యాన్ని చూసేందుకు ఒంగోలు నగరవాసులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన వేలాదిమంది ప్రజలతో వీధులన్నీ జనసంద్రంగా మారాయి. దారి పొడవునా పూల వర్షం కురిపిస్తూ, చప్పట్లు, హర్షధ్వానాలతో ప్రజలు ఈ ఘట్టాన్ని తిలకించారు. మున్సిపాలిటీ 150 ఏళ్ల పండుగ వేళ సాగిన ఈ చారిత్రాత్మక ఎద్దుల ఊరేగింపు ప్రతి ఒక్కరి హృదయాల్లో చెరగని మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

గిత్తల రాజసానికి పురస్కారాల నీరాజనం – విజేతలకు ఘనంగా ప్రైజ్ మనీ, బహుమతుల ప్రదానం!

ప్రదర్శనలో విశేషంగా ఆకట్టుకుని విజేతలుగా నిలిచిన గిత్తల యజమానులు, 1.లింగారెడ్డి .శ్రీకాంత్ రెడ్డి(50,000) 2.రాయపాటి.విశ్వేశ్వర రావు(40,000)
లకు నగదు పురస్కారాలు (ప్రైజ్ మనీ) మరియు ప్రత్యేక బహుమతులను అందించి అభినందించారు. మన ప్రాంతీయ సాంప్రదాయాన్ని, పశు సంపదను కాపాడుకుంటూ వస్తున్న రైతు సోదరులను, గిత్తల యజమానులను ఈ సందర్భంగా కొనియాడారు.

ఎద్దుల బండ్లపై ప్రజాప్రతినిధులు, అధికారుల ఊరేగింపు:

ఈ అపూర్వ ఘట్టంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా. శ్రీ బాల వీరాంజనేయస్వామి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్,
జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజా బాబు,పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావు, ఒంగోలు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య యాదవ్ గొట్టిపాటి లక్ష్మి,తదితర ప్రముఖులు ఎద్దుల బండ్లపై ప్రయాణించి ఉత్సవ శోభను ద్విగుణీకృతం చేశారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *