గత వైభవాన్ని గుర్తుచేసుకుంటూ, వర్తమానాన్ని గౌరవిస్తూ, బంగారు భవిష్యత్తు నిర్మాణానికి ఒంగోలు ప్రజలు పునరంకితం కావాలని పలువురు ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. మహనీయుల స్ఫూర్తితో సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. బుధవారం స్థానిక మినీ స్టేడియంలో జరిగిన ‘ ఒంగోలు ఉత్సవం ‘ ముగింపు వేడుకల్లో కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ రావు, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన రావు ( ఒంగోలు ), ఇంటూరి నాగేశ్వరరావు ( కందుకూరు ), ప్రత్తిపాటి పుల్లారావు (చిలకలూరిపేట), నరేంద్ర వర్మ (బాపట్ల), ఎం.మాల కొండయ్య ( చీరాల ), ఉగ్ర నరసింహారెడ్డి ( కనిగిరి ), ముత్తుమల అశోక్ రెడ్డి ( గిద్దలూరు ), కందుల నారాయణరెడ్డి ( మార్కాపురం ), ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రియాజ్, పిడిసిసి బ్యాంకు చైర్మన్ కామేపల్లి సీతారామయ్య, డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి, రాష్ట్ర సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ పొడపాటి తేజస్విని, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల టిడిపి ఇన్చార్జులు గూడూరి ఎరిక్షన్ బాబు , గొట్టిపాటి లక్ష్మి, ఇతర ప్రముఖులు పాల్గొని ఒంగోలు మున్సిపాలిటీ ప్రజలకు శతాబ్దిన్నర వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
గిత్తల ప్రదర్శనకు ప్రశంస
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాయింట్ సెక్రటరీ ఉల్లాజీ ఎలియాజర్ , అబ్జర్వర్ నియామత్ ఈ కార్యక్రమంలో పాల్గొని రికార్డు స్థాయిలో ఒంగోలు గిత్తల ప్రదర్శనకుగాను ప్రశంసా పత్రం అందించారు.
సాంస్కృతిక కనువిందు
150 ఏళ్ల ఒంగోలు మున్సిపాలిటీ వైభవాన్ని తెలుపుతూ 150 మంది విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రాష్ట్రాల సాంస్కృతిక నృత్యాలను మిళితం చేసి దేశ సమగ్రతను చాటి చెప్పేలా ప్రదర్శించిన నృత్యానికి కరతాళ ధ్వనులు మార్మోగాయి. లేజర్ షో డాన్సులు, లైవ్ బ్యాండు ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి.






Save or share this story as a newspaper-style Epaper Clip: