బేగంపేట సెప్టెంబర్ 30, (జే ఎస్ డి ఎమ్ న్యూస్ )
స్వాతంత్ర్య పోరాటం దేశ ఐక్యత సమగ్రతలను కాపాడటంలో హిందీ కీలకపాత్ర పోషించిందని హైదరాబాద్ విమానాశ్రయ జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ ఇంచార్జ్) హెచ్.ఎస్ విశ్వాస్ అన్నారు. ఈనెల 14న ప్రారంభమైన హిందీ పక్షోత్సవాలు బుధవారంతో ముగిశాయి ఈ సందర్భంగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిఎం హెచ్ఎస్ విశ్వాస్ మాట్లాడుతూ అధికారులంతా తమ రోజువారి కార్యాలయ పనులను సాధ్యమైనంత వరకు హిందీలోనే చేయాలని సూచించారు ఎన్ఎండిసి విశ్రాంత డిప్యూటీ జనరల్ మేనేజర్ రుద్రనాధ్ మిశ్రా మాట్లాడుతూ అన్ని భారతీయ భాషలో పరస్పర సహకారంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ప్రపంచ వేదికపై భారత్ ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో హిందీ భాష అనుసంధాన కర్తగా నిలుస్తోందని అన్నారు. నోడల్ రాజభాషా అధికారి అపూర్వ జైన్ స్వాగత ఉపన్యాసం చేశారు నిర్వహించిన వ్యాసరచన చర్చలు కవితాలాపన క్విజ్ తదితర పోటీల వివరాలను వెల్లడించారు పత్రాలు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో అన్చిత్ కుమార్ దత్ డిజీ సాల్వే నీతా సురేష్ తదితరులు పాల్గొన్నారు.





Save or share this story as a newspaper-style Epaper Clip: