ఓటరు నమోదు కార్యక్రమాన్ని వెంటనే ప్రారంబిచండి…. మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు.

బేగంపేట సెప్టెంబర్ 30 (జేఎస్ డీఎం న్యూస్) :
నవరాత్రి, దసరా తర్వాత ఓటు నమోదుచేసుకుందాం, టైం ఉంది కదా అనే భావన వద్దు. ఈ క్షణం నుండి ఓటరు నమోదుకార్యక్రమాలు ప్రారంభించాలి అని మాజీ మంత్రి పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు అన్నారు. బుధవారం బేగంపేట లోని జురాసియన్ క్లబ్ లో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశానికి మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ వాళ్ళు వచ్చి ఓటు రాయిస్తే ఆ ఓటర్ బిఆర్ఎస్ పట్ల పాజిటివ్ గా ఉంటాడు. First come First, మీరు క్షేత్ర స్థాయిలో పని ప్రారంభించండి అంటూ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ లో ఎక్కడ చూడని క్రమశిక్షణ శీనన్న మీటింగ్ లో చూస్తా. మీరంతా శీనన్న ఫ్యామిలీ.పోయిన సారి వాణి అక్క నిలబడ్డప్పుడు ఫస్ట్ మీటింగ్ సనత్ నగర్ లోనే పెట్టాం వాణి అక్కనుగెలిపించుకున్నాం, బోణి కొట్టాం. ఈసారి కూడా సనత్ నగర్ నుండే మొదలు పెట్టాం మల్లి గెలుస్తున్నాం.పోయినసారి 10,490
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లు సనత్ నగర్ నియోజకవర్గంలో నమోదు చేసాం ఈసారి డబల్ చేద్దాం. రేపటి నుండే ఫీల్డ్ లో కష్టపడుదాం.ఒక బిఆర్ఎస్ కార్యకర్త పొద్దున్న ఒక రెండు గంటలు, రాత్రి ఒక రెండు గంటలు అప్లికేషన్ ఫారంలు నింపితే రోజుకు 40 ఫారంలు నింపొచ్చు అన్నారు.డివిజన్ ల వారీగావిభజించుకుని గట్టిగా కష్టపడితే 10-15 రోజుల్లో ఓటరు నమోదు అయిపోతది. వేరే పార్టీ వాళ్ళు
అంగీలాగు సర్దుకొని వచ్చే వరకు ఎం మిగలకూడదు.పాజిటివ్, ప్లీజింగ్ మైండ్ తో వెళ్ళాలి. స్లొగన్స్, గుంపులుగుంపులుగా వెళ్లొద్దు. ఫామిలీస్ ను ఇబ్బంది పెట్టొద్దు.
మీరు, మీ పిల్లలు ఈరోజే ఓటర్ గా నమోదు చేసుకొని ట్విట్టర్, ఫేస్ బుక్ లో పోస్ట్ చేయండి. ఓటరు నమోదు మొదట మీ ఇంటి నుండేప్రారంభించండి ఎస్ ఐ ఆర్ లో డిలేట్ అయ్యి నోటీసు వచ్చిన వాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవచ్చు. ఓటర్ జాబితాకు, ఎమ్మెల్సీకి ఓటర్ లిస్ట్ కు సంబంధం లేదు.
వేరే ప్రాంతాల వాళ్ళు ఇక్కడే నివాసం ఉంటుంటే వారికీ ఓటు వేయాలనే ఆసక్తి ఉంటె అడ్రస్ ప్రూఫ్ ఉంటె చాలు ఇక్కడ ఓటరుగా నమోదుచేసుకోవచ్చు.నవంబర్ 1, 2023 నాటికీ ఏదైనా డిగ్రీ పాస్ అయినా వాళ్ళు మాత్రమే అర్హులు.హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కింద 43 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి అందులో సనత్ నగర్ నెంబర్-1 అవ్వాలి. 10 అక్టోబర్ వరకు టార్గెట్ పెట్టుకొని ఓటరు నమోదు పూర్తి చేద్దాం.ఓటరు నమోదు పూర్తయ్యాక బెస్ట్ పర్ ఫర్మమెన్స్ చేసిన వాళ్లకు సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేద్దాం.యువత, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాలేజీ యాజమాన్యాలు ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి కి ఓటు వేసే పరిస్థితి లేదు.
అందరిని మోసం చేసిన రేవంత్ రెడ్డి. మూడుసంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ ను ఆపేసాడు. రాజశేఖర్ రెడ్డి ఈ పథకాన్ని తెచ్చిన పేద విద్యార్థులకు మంచి జరుగుతున్నదని కెసిఆర్
కొనసాగించిండు.
2014కు ముందు కాంగ్రెస్ పెట్టి పోయిన 1500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించిండు కెసిఆర్. తొమ్మిదిన్నర సంవత్సరాలలో 19 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చాడు కెసిఆర్.
బిసి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇబ్బంది రావొద్దని కరోనా వచ్చిన, నోట్ల రద్దు జరిగిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగలేదు.మూడు సంవత్సరాల రేవంత్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగిపోయింది విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని పిల్లల ఉన్నత చదువులు ఆగిపోతున్నాయి పిల్లలు ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు.బిఆర్ఎస్ తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో ఒక లక్ష 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాము.ఎన్నికల అప్పుడు కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వీళ్ళ మాటలనుతెలంగాణ ప్రజలు నమ్మరెమో అని రాహుల్ గాంధీతో ప్రియాంక గాంధీతో అశోక్ నగర్ చౌరస్తాలో నాటకాలు ఆడించారు నేడు అధికారంలోకి వచ్చినాక ముఖం చాటేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ లు ఇచ్చి భర్తీ చేసారు అని అసెంబ్లీ లో అడిగితే 16 వేలు అంటూ సమాధానం చెప్పారు. చెప్పింది ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది మూడున్నర ఏండ్లలో 16వేలు ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధి. దిల్షుకే నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లలో ఎన్ని రోజులు ఇలా నిరుద్యోగుల లెక్క ఉండాలే మాకు ఉద్యోగ నోటిఫికేషన్ లు ఇవ్వండి అని యువత అడిగితే వీపులుపగలగొడుతున్నారు, రక్తం కారే తట్టు కొడుతున్నారు, ఆడపిల్లలు అని కూడా చూడకుండా రాత్రి రాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు.
దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ప్రభుత్వఉద్యోగులకు మొదటిసారి 42%, రెండవసారి 31% PRC ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కెసిఆర్.కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెనువెంటనే PRC ఇస్తాం, DAలు క్లియర్ చేస్తాం అన్నారు. మూడున్నర యేండ్లు అయ్యింది PRC అతీగతీ లేదు. 5DAలు పెండింగ్ లో ఉన్నాయి.సచివాలయంలో రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు. 15% కమిషన్ ఇస్తేనే వాళ్ళు GPF, పెన్షన్ డబ్బులుఇస్తామంటుంటే ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు నిరసన తెలుపుతున్నారు. దేశ చరిత్రలోనే ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ఉద్యోగులు నిరసన చేసిన చరిత్ర లేదు.
రాష్ట్రంలో కాలేజీలు మూతపడుతున్నాయి. మూడేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల దాదాపు రాష్ట్రంలో 400 డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసి కాలేజ్ లు
మూతపడుతున్నాయి. మూడేళ్ల నుండి ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యకపోతే కాలేజీ కరెంట్ బిల్లు ఎట్లా కట్టాలి, టాక్స్ ల ఎట్లా కట్టాలి, టీచర్లకు, ప్రొఫెసర్లకు జీతాలు ఎట్లా ఇయ్యాలే.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది బిఆర్ఎస్. ఎన్నో పెట్టుబడులు వచ్చాయి ఐటీ లో గాని, ఇండస్ట్రీయల్ లోగాని, హైదరాబాద్ అభివృద్ధిలో గాని కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషి మర్చిపోలేనిది. కరోనా వచ్చినా ఫ్లైఓవర్లు కట్టినం.
నేడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్న రేవంత్ రెడ్డి. ఒకవైపు హైడ్రా, ఒకవైపు 22A, ఇంకో వైపు అవినీతితో రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది.
ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ అన్నారు చదుకున్న వాళ్లకు డబ్బులు ఇస్తాం అన్నారు. ఇప్పటికి కనీసం ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో
కేటాయించలేదు. కార్పొరేషన్ నిధులు పేర్లకేకేటాయిస్తున్నారు ఖర్చు మాత్రం శూన్యం.బిసిలకు సబ్ ప్లాన్ అన్నారు, కార్పొరేషన్ అన్నారు. 1370 కోట్లు ఖర్చు చేస్తాం అన్నారు 6కోట్లు ఖర్చు చేసారు.
33 కార్పొరేషన్ లను పెట్టారు కానీ ఏ కార్పొరేషన్ వల్ల ఏ ఒక్కరికి లబ్ది జరగలేదు.అవ్వాతాతలకు 4000/- పెన్షన్ అన్నారు ఉన్న పెన్షన్ లో రెండు నెలలు ఎగ్గొట్టాడు.రేవంత్ రెడ్డి పాలనలో మోసం పోనీ వర్గం లేదు. విద్యార్థులు, నిరుద్యోగులు, యువత, ఉద్యోగులు, రైతులు, వృద్దులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలా అందర్నీ మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి.ప్రజలు అందరు బిఆర్ఎస్ వైపు చూస్తున్నారు. మల్ల వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో రేవంత్ రెడ్డి పతనం ప్రారంభంఅవుతుంది.
రేవంత్ రెడ్డి సిరిసిల్లకుదండయాత్రకు పోతుండట దండయాత్రచేయడానికి అది ఏమైనా శత్రువు రాజ్యమా..? సిరిసిల్ల తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు.4000 మంది పోలీసులతోని బిఆర్ఎస్
కార్యకర్తలను, ఉద్యమకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడుతున్నారు.ఒక్కసారి సిరిసిల్లలో అడుగు కేటీఆర్ కు ముందు కేటీఆర్ కు తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో వాళ్లే నీకు సమాధానం చెప్తారు అని హరీష్ రావు ఆరోపించారు.త్వరలో జరగనున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ,ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప
ఎన్నికలలో బి ఆర్ ఎస్ పార్టీ గెలుపు తధ్యమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి లు కూడా పాల్గొన్నారు.ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, టి. మహేశ్వరి, ఆకుల రూప, కిరణ్మయి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్ గౌడ్, కొలన్ బాల్ రెడ్డి, ఆకుల హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, వెంకటేషన్ రాజు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *