తాళ్లూరు: బెల్లంకొండవారిపాలెం గ్రామ మాజీ సర్పం చ్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పోశం నారాయణరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న వైసీపీ సీనియర్ నాయకుడు, అద్దంకి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ వైవీ భద్రారెడ్డి బుధవారం ఆయన నివాసానికి వెళ్లి ఆయన భౌతికకాయానికి నివా ళులర్పించారు. అనంతరం నారాయణరెడ్డి కుమారుడు మాజీ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్య దర్శి పోశం మధుసూదన్ రెడ్డితో మాట్లాడారు. నారా యణ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి
తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులు అర్పించిన వారిలో మండల పార్టీ అధ్యక్షుడు టి. వి సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వర్లు, గ్రామ పార్టీ అధ్యక్షుడు గువ్వల సత్యనారాయణ రెడ్డి, మండల రైతు విభాగం అధ్య క్షుడు గువ్వల శ్రీనివాస్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కొర్రపాటి విష్ణు, నాయకులు కూలూరి అంజిరెడ్డి, గూడా గోపాల్ రెడ్డి, గూడా అల్లురెడ్డి, గూడా జయరాం రెడ్డి, బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి, మంచాల వలసా రెడ్డి, దారం రమణా రెడ్డి ఉన్నారు.
కాగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అందులో మాజీ జెడ్పిటిసి మారం వెంకట రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఐ వెంకటేశ్వర రెడ్డి, టిడిపి సీనియర్ నాయకుడు మానం రమేష్, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, సి పి ఎం పార్టీ సీనియర్ నాయకులు బోడపాటి హనుమంతరావు, వెళ్ళంపల్లి ఆంజనేయులు , గంగినేనిసత్యం, మేడికొండ శేషగిరి , వివిధ పార్టీలకు చెందిన మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ప్రముఖులు సి పి బ్రౌన్ సేవాసమితి అధ్యక్షుడు యిడమగంటి లక్ష్మారెడ్డితో పాటు అనేకమంది ప్రముఖులు నియోజకవర్గంలోని ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొని ఘన నివాళులు అర్పించారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: