కృష్ణ మాదిగ చేతుల మీదుగా110 అడుగుల విజయ స్తూపం నమూనా ఆవిష్కరణ

ఒంగోలు , అక్టోబర్ 1: సామాజిక పరివర్తకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ చేతుల మీదుగా 110 అడుగుల విజయ స్తూపం నమూనా ను గురువారం ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో ఆవిష్కరించడం జరిగింది. నాగులుప్పలపాడు మండలంలో ఉప్పుగుండూరు గ్రామంలో 110 అడుగుల విజయస్తూపాన్ని ఏర్పాటు చేసేందుకుఆ నమూనాను ఆ గ్రామ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు గద్దె త్యాగరాజు ఆధ్వర్యంలో కృష్ణ మాదిగని కలిసి వివరించారు. గత 33 ఏళ్లుకు పైగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గ్రామంగా ఉప్పుగుండూరు కు పేరునిందని , దీనికి ఆ గ్రామం అర్హత ఉందని ఉద్యమంలో ఎందరో పాల్గొని నాగులప్పలపాడు మండలంలోని ఎమ్మార్పీఎస్ నాయక శ్రేణులు అందరికీ ఆశ్రయం ఇచ్చిన గ్రామం ఉప్పుగుండూరని ఆయన కీర్తించారు.ఆ గ్రామంలో ఇంత పెద్ద స్థూపాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం పట్ల కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు అనంతరం కృష్ణ మాదిగకు శాలువా కప్పి పూల బొకే అందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గద్దె శేషయ్య, ఏపీఎం కొలకలూరి రవీంద్ర కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు కొలకలూరి విజయకుమార్, బండారు సురేష్, నంబూరు భాస్కరరావు, కత్తి నాగార్జున, గంగవరపు రాంబాబు కొలకలూరి రాము, కొలకలూరి రాజేష్, జంపని అశోక్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *