దర్శిః మండలంలో రాజంపల్లిలో అంగన్వాడీ కేందం -2లో గురువారం అంగన్వాడీ ఉత్సవాన్ని నిర్వహించారు. దర్శి సీడీపీఓ పరిమళ, సూపర్ వైజర్ కె అనురాధ పర్యవేక్షణలో అంగన్వాడీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. లో కాస్ట్ నో కాస్ట్ పౌష్టికాహారం ప్రాముఖ్యతను, అంగన్వాడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణిలు, బాలింతలు వినియోగించుకుని ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యమైన సమాజం కృషికి తోడ్పాటు అందించాలని కోరారు. అంగన్వాడీ టీచర్ నరసమ్మ, ఆరోగ్య, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: