తాళ్లూరు: మహాత్మాగాంధీ జయంతిని పురష్కరించుకుని కొర్రపాటి వారి పాలెం గ్రామానికి చెందిన బాబా అటమిక్ రిసెర్చ్ సెంటర్ మాజీ అణు శాస్త్రవెత్త డాక్టర్ కొర్రపాటి చంద్రశేఖర్ స్వంత నిథులతో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మహాత్ముని జయంతి రోజు అక్టోబర్ 2 న ముఖ్య అతిథులతో ప్రారంభించారు. ప్రముఖ రచయిత్రి, అభ్యదయ వాది టి . అరుణ , రిటైర్డు ఉపాధ్యాయుడు ఎనికపాటి సుబ్బారావులు ముఖ్య అతిథిలుగా పాల్గొని విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా టి . అరుణ మాట్లాడుతూ .. … స్వయం సంవృద్ధి మరియు ఐక్యత కలిగిన గ్రామాలు
స్వర్గం కన్నా మిన్నా అనే నినాదంతో గ్రామంలో మంచి కార్యక్రమాలు చేపట్టటానికి చేయూత ఇస్తున్న రిటైర్డు శాస్త్రవేత్త చంద్రశేఖర్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా గ్రామాలు అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతను వివరించారు. విద్యార్థులు చిన నాటి నుండే స్వచ్ఛతపై, ఐక్యతపై, గాంధీజీ సిద్ధాంతాలను తెలుసుకుని జీవితంలో పాటించాలని కోరారు. రిటైర్డు శాస్త్రవేత్త కొర్రపాటి చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చూడాలన్నదే తమ కుటుంబం ఆకాంక్ష అని చెప్పారు. జీవితంలో ఉన్నతంగా ఎదిగిన ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా తీసుకుని నిత్యం అభివృద్ధి వైపు అడుగులు వెయ్యాలని కోరారు. ప్రముఖ ఈఎన్ టి వైద్యులు డాక్టర్ కొర్రపాటి నుధాకర్ మాట్లాడుతూ గ్రామంలో స్వంత నిధులతో మహాత్ముని విగ్రహాన్ని ఏర్పాటు చేసి అన్న ఆదర్శంగా నిలచారని కొనియాడారు. చంద్రశేఖర్ అన్నయ్య మనన్సు వెన్న అని ఆయన గ్రామ అభివృద్ది కోసం మాట్లాడే మాటలు కొంత కఠినంగా ఉండవచ్చని ఆయన ధ్యేయం మాత్రం అత్యున్నతమైనదని వివరించారు. రిటైర్డు డీపీఎం మార్టిన్ లూధర్ మాట్లాడుతూ గతంలో ఈ వీధి చెత్తగా ఉండేదని నేడు చాలా బాగా ఉందని , ఇకపై ఈ వీధిని గాంధీ డొంకగా పిలవాలని కోరారు. గాంధీజీ పాటించిన నీతి గురించి చిన్నారులకు వివరించారు. దివంగత మున్సిబు గోపాల స్వామి సతీమణి వెంకాయమ్మ గతంలో స్వాతంత్ర పోరాటాల గురించి గేయాలు పాడారు. మాజీ నర్పంచి కెవి బుచ్ఛెన్నచౌదరి, యువ నాయకుడు కొర్రపాటి విష్ణు, హెచ్ఎం నారిపెద్ది శ్రీనివాస రావు, సీనియర్ గ్రామ పెద్ద కొర్రపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.






Save or share this story as a newspaper-style Epaper Clip: