సికింద్రాబాద్ అక్టోబర్ 2,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్ రావు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిలకలగూడలో ఘనంగా నివాళులర్పించారు. చిలకలగూడలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా రామ్‌చందర్ రావు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, శాంతి, నైతిక విలువలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. గాంధీజీ చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో శాంతి, సామరస్యం, ఐక్యతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, క్రమశిక్షణ, దేశం పట్ల అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని అన్నారు. ఆయన అందించిన జై జవాన్, జై కిసాన్ నినాదం దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశాభివృద్ధిలో రైతుల ప్రాధాన్యతను చాటిచెబుతుందని పేర్కొన్నారు. మహనీయుల ఆశయాలను కేవలం జయంతి వేడుకలకే పరిమితం చేయకుండా, వాటిని నిత్యజీవితంలో ఆచరించాలని సూచించారు.
అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రామ్‌చందర్ రావు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి రహదారిని శుభ్రం చేస్తూ చీపురుతో ఊడ్చారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత అని, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలకు నివాళులర్పించారు.ఈ కార్యక్రములో సేవా సంకల్ప్ ఇంచార్జ్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగ పాణి ,బండా కార్తీక రెడ్డి , నాగేశ్వర్ రెడ్డి,కనకట్ల హరి , ప్రభు గుప్తా, సురేష్ ముదిరాజ్, ఆకారం రమేష్, కంటెస్టెడ్ కార్పిరేటర్లు శారద మల్లేష్, మేకల కీర్తి హర్ష కిరణ్ , అంబాల రాజు, ముఠా గణేష్, డివిజన్ అధ్యక్షులు ఇ వి నరేష్,అరవింద్, ఆదర్శ్ ముదిరాజ్, అనూష, కుమార స్వామి,హనుమంతు,మంజుల, భానుమతి రామ్,సరోజా, సురేష్ ముదిరాజ్, దేవుడు కుమార్, సత్తూరి రవి ,సంద్యా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు .



Save or share this story as a newspaper-style Epaper Clip: