శ్యామ్ లాల్ బిల్డింగ్ ఆర్‌బీఐ నివాసాలా వద్ద ట్రాఫిక్ కు అంతరాయంగా వున్నా చెట్లకు పునరుజీవం….ఇప్పటి వరకు 45చెట్లకు పునరు జీవం కల్పించిన ట్రాఫిక్ ఏసిపి శంకర్ రాజు.

బేగంపేట అక్టోబర్ 2(జే ఎస్ డి ఎమ్ న్యూస్ )
శ్యామ్ లాల్ బిల్డింగ్ ఆర్‌బీఐ నివాసాలా ముందు ట్రాఫిక్ కు అంతరాయంగా వున్నా రెండు చెట్లకుట్రాఫిక్ ఏ సి పి ఆధ్వర్యంలో పునరుజీవం చేసారు. శంకరరాజు ఆధ్వర్యంలో ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో 45చెట్లకు శంకర్ రాజు ఆధ్వర్యంలో పునరు జీవం కల్పించారు.
శ్యామ్ లాల్ బిల్డింగ్ లో రెండు పెల్టు ఫోరమ్ చెట్ల ను ట్రాన్స్‌లోకేషన్ చేశారు.మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి ఆదేశాల మేరకు ట్రాఫిక్-I డీసీపీ కె. రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో, బేగంపేటలోని ఆర్‌బీఐ క్వార్టర్స్, ఎదురుగా ట్రాఫిక్ సాఫీగా మరియు నిరంతరాయంగా సాగేందుకు అడ్డంకిగా ఉన్న రెండు చెట్లను సమీపంలోని గ్రేవ్‌యార్డ్, స్మశాన వాటికలోవిజయవంతంగా ట్రాన్స్‌లోకేట్ చేసారు.సంబంధిత శాఖల నుండి
అవసరమైన అనుమతులు పొందిన అనంతరం, ట్రాఫిక్ సాఫీగా సాగడంతో పాటు చెట్లను సంరక్షించడం మరియు పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ రెండు చెట్లను జాగ్రత్తగా ట్రాన్స్‌లోకేట్ చేసినట్లు తిరుమలగిరి ట్రాఫిక్ ఏసిపి జి శంకర్రాజు తెలియజేశారు.మల్కాజ్‌గిరి పోలీసులు ప్రజలకు 24×7 అందుబాటులో ఉంటూ, ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు, రహదారి భద్రతను మెరుగుపరచేందుకు మరియు పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలను నిరంతరం చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసిపి జి. శంకర్ రాజు, బేగంపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కావేటి శ్రీనివాసులు, ఎస్సై కె. దేవీదాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు హాజీ టోచర్, పి. నటరాజ్ ట్రాఫిక్ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *