బేగంపేట అక్టోబర్ 3(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) : త్వరలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికీ వెళ్ళి గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. డివిజన్ లలో నాయకులు టీమ్ లుగా ఏర్పడి ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. అపార్ట్మెంట్ లు, కాలనీలలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి ఓటరు నమోదు దరఖాస్తులను అందజేసి వివరాలు సేకరించాలని చెప్పారు. గత గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఓటు వేసిన వారు కూడా తిరిగి తప్పకుండా ఓటరుగా నమోదు చేసుకోవాలనే విషయాన్ని కూడా వివరించాలని అన్నారు. గత ఎన్నికలలో నియోజకవర్గ పరిధిలో 10 వేల మంది గ్రాడ్యుయేట్ లను ఓటరుగా నమోదు చేయించడం జరిగిందని ప్రస్తుతం 40 వేల మంది గ్రాడ్యుయేట్ లను ఓటర్లుగా నమోదు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేషన్ రాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, గందే నాగులు, ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, నామన సంతోష్ కుమార్, కరుణాకర్ రెడ్డి, లక్ష్మీపతి, మహేందర్ గౌడ్, ప్రేమ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, రామ్ నివాస్ బన్సాల్, శేఖర్, వెంకటరమణ, శ్రీకాంత్ రెడ్డి, కూతురు నర్సింహ, కట్టా బలరాం, బాసా లక్ష్మీ, దుర్గ, నాగలక్ష్మి,, అనిత రెడ్డి, సీమా తదితరులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: