బేగంపేట అక్టోబర్3, (జెఎస్ డీఎం న్యూస్) : నల్లగుట్టలో ఉచిత వైద్య శిబిరం
పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం రాంగోపాల్ పేట్ డివిజన్ లోని నల్లగుట్ట అభివృద్ధి సంఘం హాలులో అప్సా స్వచ్ఛంద సంస్థ, జనహిత సేవా ట్రస్ట్, కిమ్స్ ఫౌండేషన్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పేద ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో మరిన్ని ఉచిత వైద్య శిబిరాలనుఏర్పాటు చేయాలని కోరారు. వైద్యం ఎంతో ఖరీదైన పరిస్థితులలో పేద ప్రజలు కూడా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కిమ్స్ ఆస్పత్రి డాక్టర్ లు 150 మందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షించి, ఆరోగ్య సలహాలను, మందులు అందజేశారు. ఈ శిబిరంలో మాజీ కార్పొరేటర్ లు అత్తెల్లి అరుణ గౌడ్, అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఆంజనేయులు, కోటేశ్వర్ గౌడ్, సతీష్, గణేష్, జనార్దన్, రాజు, చంద్ర ప్రకాష్, అరుణ్ భట్, సత్యనారాయణ, అభిషేక్, విఠల్, జనహిత సేవా ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నర్సింహ మూర్తి, వెంకట్, అప్సా సంస్థ ప్రోగ్రామ్ మేనేజర్ ఎం. బస్వరాజ్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి. రమేష్, జి. మంజుల, సిబ్బంది, నల్లగుట్ట అభివృద్ధి సంఘం ప్రతినిధులు గున్నాల నరేష్, యశ్వంత్ రావు, సురేష్, రాజు, గంగరాజు, జనహిత క్యాంపు కో ఆర్డినేటర్ బి. నర్సింగ్ రావు, కిమ్స్ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ జే.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.




Save or share this story as a newspaper-style Epaper Clip: