బేగంపేట అక్టోబర్ మూడు (జెఎస్ డి ఎం న్యూస్) :
అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట లో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పలువురు గ్రాడ్యుయేట్ లు తమ వివరాలతో కూడిన ఓటరు నమోదు పత్రాలను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో ఓటు వేసిన గ్రాడ్యుయేట్ లు కూడా తప్పనిసరిగా తిరిగి ఓటరుగా నమోదు చేసుకోవాలని చెప్పారు. ఓటరుగా నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ లు తమకు పరిచయమున్న గ్రాడ్యుయేట్ లు కూడా ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని అన్నారు. ఇంటింటికీ వెళ్ళి గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్, డివిజన్ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు సతీష్, కోటేశ్వర్ గౌడ్, సత్యనారాయణ, మిట్టు, గణేష్, జనార్దన్, రాజు, అరుణ్ భట్, అభిషేక్, విఠల్, తదితరులు ఉన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: