సికింద్రాబాద్ అక్టోబర్ 3,(జే ఎస్ డి ఎమ్ న్యూస్ ) :
అమరావతి విద్యార్థుల ప్రతిభ అద్భుతం అని సికింద్రాబాద్ బిజెపి ఎమ్మెల్యే కంటెస్టెడ్ క్యాండిడేట్ మేకల సారంగపాణి అన్నారు.
25 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలన,సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సాహంచాలన్నదే బిజెపి సంకల్పమని అన్నారు. చిలకలగూడ అన్నా నగర్ లోని అమరావతి టాలెంట్ స్కూల్ విద్యార్థి విద్యార్థినులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.
విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అద్భుతంగా ఉందని వారికి ఉజ్వల భవిష్యత్తు ఉందని మేకల సారంగపాణి తెలిపారు. ప్రతి పోటీలలో ముగ్గురు చొప్పున ఎన్నికైన వారికి తగిన బహుబతులు అందజేస్తామని, వారిని ఇతర జిల్లాల్లో జరిగే పోటీలకు పంపుతామని తెలిపారు. విద్యార్థులకు విద్యను నేర్పిన గురువులకు వారి తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కనకట్ల హరి, ప్రభు గుప్తా, కొల్లినాగేశ్వరరావు ,డివిజన్ అధ్యక్షులు ఇవి నరేష్, సీనియర్ నాయకుడు రమేష్ చిన్నా,శ్రీనివాస్ స్కూల్ టీచర్లు హెడ్మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ యజమాన్యానికి సన్మానం చేశారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: