తాళ్లూరు: జిల్లాలో ప్రసిద్ది చెందిన గుంటి గంగా భవాని ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో
పాల్గొని చల్లగా చూడమ్మా గంగమ్మ తల్లి అంటూ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు ప్రకాశ రావు, కామేశ్వర శర్మ, బాల రాజు, విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. దేవాలయ ట్రస్ట్ తరపున అన్నదాన సత్రంలో అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ చైర్మన్ సానే సురేష్, ఈఓ నారాయణ రెడ్డి, ఆర్ఎ ప్రసాద్‌లు భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు.

Save or share this story as a newspaper-style Epaper Clip: