దర్శిలో ఘనంగా అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

దర్శి : అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని దర్శి తాలూకా కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రకాశం జిల్లా ఎగ్జిక్యూటివ్ సభ్యులు, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సెంట్రల్ కమిటీ కన్వీనర్ కపురం శ్రీనివాసరెడ్డి , పురావస్తు లిపి పరిశీలకులు, తహశీల్దార్ కార్యాలయ సీనియర్ సహాయకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహశీల్దార్ టి. దేవప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు .
అనంతరం సమాజానికి విశిష్ట సేవలందించిన విశ్రాంత ఎల్.ఎఫ్.ఎల్ ప్రధానోపాధ్యాయులు సూరె నాగచెంచు సుబ్బారావు, రెడ్డెం వెంకటరెడ్డి మరియు విశ్రాంత అధ్యాపకులు పున్నావజ్జుల శ్రీధర్ లను ఘనంగా సన్మానించారు .
ఈ సందర్భంగా జీవీ రత్నం, కపురం శ్రీనివాసరెడ్డి, తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ శర్మ తదితరులు మాట్లాడుతూ సమాజంలో ఉ పాధ్యాయుల పాత్ర అమోఘమని, వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ పాలకురాలు విజయలక్ష్మి, వీఆర్వో మీరాబి, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *